పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

I30 తిర్యగ్విద్వన్మహాసభ

చేరినా యితను ఇదివరకు అనేకగోమేధాలూ అశ్వమేధాలూ చేసినవాడే మనమేదైనా మాయోపాయం పన్ని యీకర్యం చెడగొడుదాము.

వ్రాఘ్రా---సభవారూరుకున్నరేమి?

మల్లు-నూకుతగిన ఫలప్రదానాలు యిప్పిప్తే మేఘు వప్పుకుంటాము.

రామ---(రహస్యముగా) మించిపోచూపుంది. యేమైనా వుపాయం ఆలోచించినావా?

కొంక---మర్కటజోస్యులూ! మాట. (రహస్యముగా) ఇప్పుడు నక్షత్రం మంచిదికాదని నీవు ఆటంక పెడుదూ. తెల్లవారిన తరువాత మరివక వుపాయం ఆలోచింతాము.

వ్రాఘ్రా---ఏమిటి మీముగ్గురూ మహా గుసగుస లాడుతూ వున్నారు?

కొంక---ఏమీలేదు కర్మకు ఇప్పుడు మంచి ముహూర్తమగునా కాదా అనే ఆలోచిస్తూ యున్నాము.

వ్యాఘ్రా---మీ ఆలోచన తెగిందా యింకా తెగలేదా?

మర్క---తెగింది. యీరాత్రి నక్షత్రం బాగావున్నదికాదు.

వృష---దహనానికి మంచి నక్షత్రంయేమిటి? సభవారందరూ వప్పుకున్న పని వేగిరం కానియ్యండి.

రామ---నక్షత్రం మచిది కానప్పుడు చెయించడానికి మేము వప్పుకోము.

కొంక---నెనూ వప్పుకోను.

వృష---మీదు యిద్దరు వప్పుకోకపోతే యేమిలెండి.

గార్ద---వృషభేందర్రావుగారూ! మీసభవారితో వివాద పడబోకండి. వివాదపడితే అందరూ వప్పుకున్న కార్యం నిష్కారణంగా చెడిపోతుంది(రహస్యంగా)యింతలో మునిగిపోఇందేమిటి (ఈరాత్రి) నాలగు జాములు వొపిక చేస్తురూ. తెల్లవారిన తరువాత మేమంతావచ్చి కార్యం జరిగిస్తాము. (ప్రకాశముగా) అయ్యా సఃవారికి నమస్కారము. యీరాత్రి ప్రొద్దుపోయంది గనుక సభవారనుగ్రహించి వుదయాన్నే దయచేసి యీకార్యం యేలాగైనా సానుకూలం చెయ్యండి.

అంజ---అలాగైతే మేమింటికినడిచి రేపు వుదయాన్నే వస్తాము.(అని బంధువులతో వెళ్ళుచున్నాడు.)

గార్ద---రామబందుశాస్త్రిగారూ! యిలాగురండి (చెవిలొ) మీరు ప్రాయశ్చిత్తం చేయించకుండా వదలిపెట్టవద్దు (ప్రకాశముగా) రేపు వుదయాన్న పెందరాళే దయచేయండి.

రామ---(రహస్యముగా) ఇందులో ప్రాయశ్చిత్తం యెవరికికావలెను? మాకు దొరికేకూడు పడిపొతూ వున్నది.