పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 20-6 సాళంగనాట సం: 10-119

పల్లవి:

అందు కేమి దోసమా అయితే నేమి
కందువై లోకములోనఁ గలదే కాదా

చ. 1:

వలచి యిందిరాదేవి వన్నెలుఁ జక్కఁదనాలు
తలఁపులో నేపొద్దూఁ దలపోయఁగా
సలిగెతోడుత నాపె సారూప్య మందినట్టు
నలు వై గోవిందుఁడే నారాయణి యాయను

చ. 2:

బాలకి యై లకిమమ్మ పైపై శిగ్గువడఁగా
తేలించి యాపె మనసు తెలియఁ బూని
చాలా వేడుక నాకె సకియె యుండినటు
ఆలికిఁ గా భువనమోహనరూప యాయను

చ. 3:

యెడయ కింతులలో మే లెల్లాఁ దెలియఁ బూని
కడఁగి యాఁడురూపము గైకొని చూచి
బడినె తనకు నెందూఁ బతిలేనివాఁడు గాన
కడ గోవిందుఁడే శ్రీవెంకటనాథుఁడాయను