పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 11-2 శంకరాభరణం సం: 10-061

పల్లవి:

నా కన్నిచేఁత లెల్ల నాయకుఁడ యియ్యకోలె
యీకడ నీవేడుక యీడేరితేఁ జాలును

చ. 1:

దాపుగా వారింటఁ గాని దగ్గరి మాయింటఁ గాని
వోపికతో నీవు లెస్స వుంటేఁ జాలు
ఆపెవద్దఁ గాని అట్టె నావద్దఁ గాని
తీపు లైన నీముచ్చట తీరితేఁ జాలును

చ. 2:

అతివచేతనె కాని అట్టె నాచేతఁ గాని
యితవుగా నీవు భూజియించితేఁ జాలు
సతమై యాపెతోఁ గాని జట్టిగా నాతోఁ గాని
బతిమివట్టినట్లాఁ బాయకుంటేఁ జాలును

చ. 3:

అలయింతిరతిఁ గాని అట్టె నారతిఁ గాని
చెలువమై నీసుఖము చెల్లితేఁ జాలు
చెలరేఁగి యిద్దరిని శ్రీవెంకటనాథుఁడ
చలపట్టి కూడీతిగా సత మైతేఁ జాలును.