పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 11-1 పాడి సం: 10-060

పల్లవి:

అంత మనసరి వని ఆడేనా నిన్ను
చింతించే నీయాల ననే సిగ్గు కింతే కాకా

చ. 1:

నవ్వులు నవ్వేవు నీవు ననుపువానివలెనె
యెవ్వతెతో నైనా న దేరా నీవు
దువ్వటపుఁ బయ్యదపైఁ దోగిన చెమట నీపై
చివ్వనగోళ్ల నాపె చిమ్మె ననీ కాక

చ. 2:

ముచ్చట నెవ్వతె నైన మొకము దగ్గరఁ బోయి
యిచ్చకము లాడేవు యేరా నీవు
మచ్చిక నాపె నీతోను మారుమాఁట లాడఁగాను
తచ్చన వీడెపుటాలి దాఁకె ననీ కాక

చ. 3:

చనవున మెచ్చి మెచ్చి సారెకు నెవ్వతె నైనా
యెనసి కాఁగిలించేవు యేరా నీవు
నను నిట్టె శ్రీవెంకటనాథుడ కూడితివి
అనువై యాపె వాసన లంటె ననీ కాక.