పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 09-3 బౌళి సం: 10-050

పల్లవి:

నీ వేమి సేతు వాపె నిన్నుఁ బెరరేఁచగాను
తావుల సాకిరి గోరఁ దగదా నిన్నును

చ. 1:

పోరాడే వాపెకుఁగా వూనుక నీవు రాఁగా
మేరతోఁ జుట్టా లెల్లా మెచ్చకుండేరా
సారె సారెఁ బిరిదూరి సాకిరులు చెప్పఁగాను
తీరిచేటి చెలు లెల్ల దీవించకుందురా

చ. 2:

కన్నుగీఁ టాపెకు నాకుఁ గై లాటాలు వెట్టఁగాను
కన్న విన్న వారెల్లాఁ బొగడకుండేరా
మన్నించి యాపెకు నీవు మాఁట లందియియ్యఁగాను
సన్నల వాడవారెల్లా సంతసించకుందురా

చ. 3:

సందడి జగడాలలో సారె నన్నుఁ బట్టఁగాను
అందరును నిన్నె మేలనకుండేరా
అంది శ్రీవెంకటనాథ ఆపెను నన్నుఁ గూడితి
విందురు నీచేఁత లివి యెంచకుండేరా.