పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 08-1 శ్రీరాగం సం: 10-042

పల్లవి:

సంగతిగా మాఁటలాడ జాణ వౌదువె నీ
సంగతి గలదు గాన జాణనె పో యెపుడు

చ. 1:

యెక్కువఁ బయ్యదలోని వేఁటివె యింతి అవి
పక్కనె వలపు నించే పైఁడికుండలు
పెక్కువ మేడలమీఁదఁ బెట్టవచ్చుఁబో నీవు
మిక్కిలి నెప్పుడు నుండే మేడవో నాదేహము

చ. 2:

హెచ్చె నీమైఁ బులక లివేఁటికె యింతి అవి
ముచ్చట మోహపునోము మొలకలురా
పెచ్చుగా దేవరమీఁదఁ బెట్టచ్చుఁబో నీవె
వచ్చి వరము లిచ్చే దేవరవెపో నాకును

చ. 3:

యినుమడించెఁ జెమట లేఁటికే యింతి రతిఁ
దనివోని కళలెల్ల దైలువారెరా
అనువై అట్లానైతె అగ్గువాయఁబో నన్ను
ఘనమై కూడితి శ్రీవేంకటనాథుఁడా.