పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0116-4 దేసాళం సంపుటం; 07-094

పల్లవి:
ఇరవైన సరసుఁడు యించుకంతలోఁ దెలుసు
సారిదిఁదప్పక యిట్టె చూచితేనే చాలదా

చ.1:
నగవులే నయమైతే నాటుకోవా ప్రియములు
తగవులఁ బెట్టఁగానే దాఁగీఁ గాక
అగడు సేయకరావె ఆతనినేల దూరేవే
మొగము చూచి చూచి మొక్కితేనే చాలదా

చ.2:
కోరికలే కుష్పలైతే కొండంత గాదా వయసు
ఆరితేరఁగా వెగటయ్యీఁ గాక
పేరఁబెట్టకిఁక రావే పెనఁగనంతేశాలే
మేరతోనే వొకమాట మెచ్చితేనే చాలదా

చ.3:
మాటలెల్లా మూటలైతే మనసులొక్కంత గాదా
పాటిసేయకుండఁగానే భ్రమసీఁ గాక
యీటులేక శ్రీ వేంకటేశుఁ డింతి నిట్టే కూడె
నీటుతో డనిఁకరావే నిలిచితేఁ జాలదా