పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0116-3 ఆహిరి సంపుటం; 07-093

పల్లవి:
ఏల పురుఁడు వెట్టుక యింత సేసేవు నన్ను
మేలిమివాఁడవు నీవు మెంగదాన నేను

చ.1:
విరహానఁ గాఁకరేఁగి వేసాలకుఁ జలిగాసి
దొరతనాలు సేసీటి దొడ్రవాఁడవు
గురువింద పూవులు కోరి మనసునఁ గోసి
వరుస నిన్నుఁ బూజించే వనితను నేను

చ.2:
నారలు నాలివొలిచి నమ్మికలఁ దాడు వేఁడి
పోరచిని వల్లెవేసే పొట్టివాఁడవు
గారవపు నవ్వులనే కప్పురాలు నూరి నూరి
సారెకు నీపైనఁ బూసే జలజాక్షిని నేను

చ.3:
కలలోనుంకువవెట్టి కౌఁగిటిలో నన్నుఁ గూడి
సాలసీటి శ్రీ వేంకటెశుఁడవు నీవు
పలచని చెమటల పన్నీటికాలువదెచ్చి
జలకములార్చేటి సకియ నేను