పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0116-2 శంకరాభరణం సంపుటం: 07-092

పల్లవి:
ఎరవై దూరితిమి యిన్నాళ్ళదాఁకా నిన్ను
సరసములాడఁగాను సాదించేమా

చ.1:
వల్లెవేసి కోడెలను వంచుకొనేయట్టి నీకు
చెల్లునెంత నీవు చేఁత చేసినా మమ్ము
వెల్లవిరిగా దొంగిలి వెన్నలు దినినవోట
పల్లదాలేమాడినాను పాటివట్టేమా

చ.2:
మెండుగఁ జీరలుదీసి మెరసిన చేతుల
దుండగాలెంత నించినా దోసమనేమా
అండనే పదారువేల ఆయాలు మోచిన నీమై
వొండె మాచన్నులు మోవనోపదనీనా

చ.3:
గోవుల చన్నులు నోర గుమ్మలాడిన నీమోవి
యీవల మాకియ్యఁగాను యెంగిలనేమా
శ్రీ వేంకటేశ నన్నుఁజేరి యిట్టె కూడితి
వావిరినెంతమెచ్చినా వలదననా