పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0115-2 సామంతం సంపుటం: 07-086

పల్లవి:
ఇందరినే మడిగే విందాఁకాను
సందడి మీకిద్దరికి జవ్వనమే సాక్షి

చ.1:
సెలవి నవ్వులకును సిగ్గులే దాపు
కలికి చూపులకును కన్నులు దాపు
నిలుచున్న యాపెకును నీవు దాపు
మలసిన నీకు నాపె మంతనాలు దాపు

చ.2:
చెక్కిటి మెఱుఁగులకు చేయి మాటు
పెక్కుల మాటలకు పెదవి మాటు
చక్కని యాపెకు నీ సన్నలు మాటు
మొక్కలపు నీకు నాపె మొక్కులు మాటు

చ.3:
భారపు గుబ్బలకును పయ్యద కాపు
పేరిన వలపులకు బింకము గాపు
ఆరయ శ్రీ వేంకటేశ అలమేల్‌మంగకు నీకు
యీరీతినొనగూడిన యింపులే కాపు