పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0115-1 శంకరాభరణం సంపుటం: 07-085

పల్లవి:
చేయి మీఁదాయను నీకుఁ జెల్లదా మఱి
మాయింటనే వుండఁగాను మావంకదే చలము

చ.1:
దూరినదాన నేనింతే తొల్లి నీవు శాంతుఁడవే
వూరకున్న వారి తోడ నూరోపదు
మారాడవన్నీఁ జేసి మంచివాఁడ వౌదువు
మేరతో నుండి మిమ్మాడేమేమే మంకులము

చ.2:
సన్నల నేఁ దిట్టేదాన సాదించవెన్నఁడూ నీవు
కన్నులు మూసితేనే లోకము మఱఁగు
యెన్నిటికైనా నోర్చేవు యెందుండో వచ్చి దొరవు
చన్నుల మోచి నిన్నాత్తి చపలపువారము

చ.3:
సేవకురాల నేనింతే శ్రీ వేంకటేశుఁడ నీవు
దేవరవంటివాఁడవే దిట్టువిన్నిటా
చేవనలమేల్‌ మంగనై చెలఁగే నీవేలితివి
కైవశమైవుండి నేమే కాతరపువారము