పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0114-6 వరాళి సంపుటం: 07-084

పల్లవి:
ఎంతయినా మీలోన యెరవున్నదా
చెంతనున్న తీగెలెకా చిగిరించేవి

చ.1:
జగడాలు మానరాదా సరసమాడేటి వేళ
యెగదిగనాడితే యెగ్గులున్నవా
పాగరు మాఁకుల మీఁది పువ్వుల వొగ రేకాదా
తెగడి పెరఁ బెట్టితే తెనెలయ్యేవి

చ.2:
పెనఁగక వుండరాదా ప్రియముతో నాపె నిన్ను
చనవున ముట్టితేనే సడివచ్చెనా
పనివడి వోరుచుక పలుమారు సాదించితే
తినఁదిన వేములేకా తీపులయ్యేవి

చ.3:
పిలిచి శ్రీ వేంకటేశ బిగియఁగనేల యాపె
బలిమిఁ గూడితేనే పంతమాయనా
చలువగాఁ దూరుపున చంద్రోదయమైతే
వెలయఁ జీఁకటేకాదా వెన్నెలయ్యేది