పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0112-5 ఖైరవి సంపుటం: 07-071

పల్లవి:
జాణండవు నీకునిదే చద్దివలపు
రాణించె నింకెన్నఁడు నీరపమాయ వలపు

చ.1:
చెక్కు నొక్కి తనివోక చెలి నీపై మోహాన
మొక్కులు మొక్కీనూరకే మోము చూచీని
చిక్కని నవ్వులు నవ్వి చిదిమినా నెఱఁగదు
వెక్కసములాయఁ బట్టు వేఁడి వేఁడి వలపు

చ.2:
మమత నీపైఁ బెంచి మనసు పట్టఁగ లేక
భ్రమసి నీలోఁచి (?) లోలో బయలీఁదీవి
కొమెరమదానఁ జొక్కి కోపంచినా నెఱఁగదు
తమితోడఁ బట్టుమీ పదను వచ్చేవలపు

చ.3:
పవళించి సన్నచేసీ భావము నిలుపలేక
చెవిలోన మాటచెప్పి చెమరించీని
తివిరి శ్రీ వేంకటేశ తెరవేసి నిన్నుఁ గూడె
నవకానఁ బట్టుమీ కొన్నదికోలు వలపు