పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0112-3 సామంతం సంపుటం: 07-069

పల్లవి:
నేము నీవారమె యిందు నెరుసులేవి
చేమీఁదయిన మీఁద చెప్పనేల పనులు

చ.1:
కందువ పనులు సేయఁ గలవు నీవేమైనా
అందాలు సేసుకరాను ఆపె గలదు
పాందులు చూచి మిమ్ము పాగడనేము గలము
మందలించి నగనవయ్య మఱి యాల కడమ

చ.2:
వన్నెలనెవ్వరినైనా వలఎంచ నీకుఁ జెల్లు
అన్నిటాను దొరతనమాపెకుఁ జెల్లు
కన్నచోటనెల్లా వూడిగానకు నేము గలము
యిన్నిటా మెరయవయ్య యిఁకనేల మరఁగు

చ.3:
నెలఁతల మర్మములు నీకొక్కనిక పాలు
అలరిన నీరతులు ఆపెపాలు
యెలమి శ్రీ వేంకటేశ యిద్దరిసేవా మాపాలు
నిలువునఁ జొక్కవయ్యా నీకేల వెఱపు