పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0151-3 కన్నడగౌళ సంపుటం: 07-299

పల్లవి:
అయ్యోయేమనవచ్చునాసాస నీపతి
యేయెడం బాయకపోయనేమవునోయమ్మా

చ.1:
కోవిలకూఁతలు విని కొమ్మ విలిచీనంటా
దావతితో రమణుఁడు దగ్గరఁబోయి
ఆవలనొక నెమలి అంతలోనేఁగఁగఁ జూచి
వేవేగ చెలియంటా వెంటఁ గూడఁబారె

చ.2:
కీరము వేరొకచోటఁ గెలయుచునుండఁగాను
చేరఁబోయె సతియందుఁ జెలఁగీనంటా
నీరులోతామరమీఁద నిండుఁదుమ్మిదలఁ జూచి
కోరి యింతిముఖమంటాఁ గొలనిలో దుమికె

చ.3:
చెంతఁబావురాలమోఁత చెలిమంతనములంటా
సంతసానఁ బొదరింటి చాయకేఁగెను
అంతలో శ్రీవేంకటేశుఁడలమేలుమంగఁ గని
వింతరతులను గూడి విఱవీఁగెను