పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రెకు: 0151-2 శంకరాభరణం సంపుటం: 07-298

పల్లవి:
ఒకటి కొకటి పైనొరపాయ
చికురభరములో చిడిముడియాయ

చ.1:
జలజపువదనకు చాయలకన్నులు
జలజప్తురేకులు సహజములే
నలుపునఁ జనుపక నాసికమొకటే
కలసి కదంబపు కలబెరికాయ

చ.2:
పెనుగజయానకు పిరిఁదిబటువులే
మొనకుంభస్టలములు దొరసె
చెనసి అందుపై సింహపునడుమే
వెనక ముందరికి విరసములాయ

చ.3:
నిరతి బాహులతల నెలఁత కుచములే
విరిపూ గుత్తుల విధమమరె
ఇరవుగ శ్రీవేంకటేశుని కూటమి
పరిమళములలోఁ బరిమళమాయ