పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0104-6 సాళంగనాట సంపుటం: 07-024

పల్లవి:
ఔలే విరహుల జాడలటు వలెనే
తాలిమి లేక తామే తమకింతురు

చ.1:
మాటకు మునుపనే మగువలఁ దిట్టేవు
పాటించి వినఁగరాదా పనులెల్లాను
సూటిగా నీ పతిమోము చూచిన యంతటిలోనే
కాటుక కన్నుల నీరు కడు నించేవు

చ.2:
చేయివట్టి తీయఁగానే చిమ్ముము విదిలించేవు
ఆయెడ నోరుచ రాదా అయినదాఁకాను
దాయికొని రమణుఁడు దగ్గరఁ గూచుండితేనే
పాయక అవ్వలిమోమై పవ్వళించేవు

చ.3:
వీడెము నేనియ్యఁగానే వేసరి వొల్లననేవు
యీడనె మీ నేరుపులెంచుకోరాదా
పాడిగాఁ గానట్టే పక్కన శ్రీవేంకటేశ
కూడితి వింతటిలోనే కొల్లున నవ్వేవు