పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0103-4 సాళంగనాట సంపుటం; 07-016

పల్లవి:
మాతోడి నవ్వులు మఱి యాల చే
చేత నెందురు చూచీనదె చెలియ

చ.1:
వలసిన యెడలకు వచ్చేదే మేలు
వలవని జోలికి వాదె మేలు
బలిమి సేయమిఁక పడఁతికడకు మ
మ్మెలమి నంపినా యెట్టెనా మేలు

చ.2:
మనసు వచ్చితే మాటాడుటే మేలు
ననుచకున్న మోనము మేలు
అనలేము నిన్నునాసపడిన చెలిఁ
జెనకక నీవేమి సేసినా మేలు

చ.3:
పొందే కలిగిన భోగించుటే మేలు
కందిన యెడ నలుకలు మేలు
యిందులో శ్రీ వేంకటేశ కూడితివి
యిందుముఖికి నీకిదియే మేలు