పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0103-2 పాడి సంపుటం; 07-014

పల్లవి:
ఎవ్వరెవ్వరి చిత్తాలు యెట్టుండునో
యివ్వల నీకు మొక్కేది యెట్టుండునో

చ.1:
పగట్ల నీతోఁ బలుమారు నవ్వఁగాను
యెగసెక్కెమని నీకు నెట్టుండునో
తగిలి నీవొద్దనట్టి దాయక పాయకుండఁగ
అగడుగ నేమడిగేనని వుండునో

చ.2:
చెంతల నీ చెక్కు నొక్కి సేవలు నేఁజేయఁబోతే
ఎంత ఱట్టడిది యని యెట్టుండునో
పొంతనే యాటపాటల పొద్దులు గడపితేను
యింత మాయదారి యని యెట్టుండునో

చ.3:
కాతరాన మాయింటికి గక్కనఁ బిలిచితేను
యేతులెంత సేసేనని యెట్టుండునో
ఆతుమై శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
యీతగుమన్నన నాపై నెట్టుండునో