పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0121-6 ఆహిరి సంపుటం: 07-126

పల్లవి:

ఇంత మాయకాఁడవౌత యెఱఁగనైతి నేను
పొంతల నాచే గందము పూయించుకొంటివి

చ. 1:

సారెకు నావలపు రచ్చలఁ బట్టేనని కా
పోరుచు నాచీర కాసె పోయుమంటిమి
వారి వీరిచేత నన్ను దూరించేనని కా
కేరుచు నాకొనగోర గీరించుకొంటిని

చ. 2:

ఆడుకో నన్నునింత అలయించేనని కా
వేడుకతోఁ గమలాన వేయుమంటివి
జాడతోనింతేసి దోసాలు గట్టేనని కా
వీడక తొడపైఁ దొడ వేయించుకొంటివి

చ. 3:

పందెమాడి నన్నునింత పచ్చి చేసేనని కా
చెంది నీమోవి యెంగిలి సేయుమంటివి
అంది శ్రీ వేంకటేశ నన్నంటి పాయనని కా
ముందరనే నన్నుఁగూడి మొక్కింపించుకొంటివి