పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0121-5 రామక్రియ సంపుటం: 07-125

పల్లవి:
నీవే జాణవైతే నిన్ను మెచ్చేను
ఆవలనెమ్మెలూరక ఆడుకోకువే

చ.1:
చలువయినదెయ్యది చవులలోనేది చవి
తలఁపులోననేది దగిలియుండు
చెలఁగు మోమేమిట చిఱునవ్వెప్పుడు వచ్చు
వలపెరిఁగితే నిది వర్ధించవే

చ.2:
ఆసలేమిట నిండు ఆయమేమిటఁ గరఁగు
బాలెందాఁకాను పనికి వచ్చు
యీసులేరీతిఁ దీరు యింపులేగతిఁబుట్టు
వాసి నేర్చులు గలితే వర్ణించవే

చ.3:
చింతలేమిటఁ బాయు సిగ్గులేవల్లఁ దీరు
పంతమెందుల వచ్చు పనిగొంటేను
యింతలో శ్రీ వేంకటేశుఁడిటు నన్ను నిన్నుఁ గూడె
వంతుదానవై తేను వర్ణించవే