పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0121-4 శ్రీరాగం సంపుటం; 07-124

పల్లవి:
సూడువట్టేనని మిమ్ము సుదతి గాచుకున్నది
ఆడరాదీతగవు మిమ్మ గేమయ్యా

చ.1:
ఉవిదచన్నులు నీవు వుంట వింట వేసితేను
తవిలి పూబంతిఁ గొప్పు తరుణి వేసె
జవళి నీరెండు వద్దిసతిమీఁద బడెనదే
తివిరి పంతమెవ్వరు దిద్దవలెనయ్యా

చ.2:
కైరవడినాళమునఁ గాంతపై నీవూదితేను
వూరక నీపైఁ దమ్ములముమిసెనాపె
యీరెండు మిట్టించి యాయింతిమీఁదనె తాఁకె
తీరుగా నీచిక్కెవ్వరు తీర్చవలెనయ్యా

చ.3:
శ్రీ వేంకటేశ్వర గోరఁజిమ్మి యాపె గూడితేను
చేవ మీరఁ బాదమునఁ జిమ్మె నిన్నాపె
ఆవల రెండును వచ్చి అండనాపెకె తగిలె
కోవరపు పొందెవ్వరు గూర్చవలెనయ్యా