పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0214-1 మాళవిగౌళ సంపుటం: 08-079

పల్లవి:

ఏడనుండా నాసొమ్ము యెందు వొయ్యీనే
వీడెములో కప్పురమే వీనివలపెల్లను

చ. 1:

పంతమాడుకొనఁ గాని భావించ నాతనిరూపు
చింతించ నాలోనిదే చెప్పనేలే
దొంతివెట్టి గొల్లెతలు దోమటిదొడుకఁగాను
బంతిచిక్కినట్టి మోవిపండు నే దాఁచితినే

చ. 2:

విచ్చి చెప్పఁగాని తనవింతచక్కఁ దనమెల్ల
పచ్చి నాచపులలోనే పదరనేలె
ముచ్చటఁ బదారువేలు ముడిచివేసినపువ్వు
తెచ్చి నేదాఁచుకొంటిని దేవర యెరఁగదా

చ. 3:

ఱట్టు నీ నారతి నాఱడి శ్రీవేంకటేశుఁ
డొట్టి వొరసినవొర వొరయనేలె
అట్టె తొల్లిటివారి అరచేతి నిమ్మపండు
గుట్టున నేఁదీసుకొంటి గుఱుతులడుగరె