పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0202-1 శ్రీరాగం సంపుటం: 08-007

పల్లవి:

రచనలనిన్నిట రసికుఁడవు
యిచట విన్నపంబిదె సేసెదను

చ. 1:

పలుకుల చిలుకల పాటకోవిలల
పిలుచులుగా చెలి పెంచెనదే
అలుగకుమీ నీవందుకు రమణుఁడ
కల సహజమె యిది కసరులు గావు

చ. 2:

చనుజక్కవలను సతి నెరుయలుల
ఘనముగ మూఁకలు గట్టించె
మొనలుచూపె మోపుగట్టెనని
ననిచి వేరకు నాథుఁడవు

చ. 3:

నడపుల హంసల నయనచాతకముల
పడఁతి శ్రీవేంకటపతి పొదిగె
నిడువులఁ గడుచు నిన్నుసోఁకించెనని
జడియకుమీ నీచనవులె మెరసి