పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0211-6 పాడి సంపుటం: 08-066

పల్లవి:

తాసువంటిది మన తప్పులు నీకా లేవు
మూసిన ముత్యాలవలె ముంచీని నవ్వులు

చ. 1:

పొలఁతికి బాసయిచ్చి బొమ్మచారివై వుండఁగ
చెలి వేరొకతె వచ్చి చేయివట్టీని
బలిమి యెవ్వరిదో పనులు దాదాత మోచె
నిలువునూరు వండీని నీమేనిపలకలు

చ. 2:

వనితకు సన్నసేసి వ్రతము వట్టుకుండఁగ
పెనఁగి వేరొకతె తాఁ బిలిచీ నిన్ను
చనవు లెవ్వరిపాలో చవులు రెంటాఁదోఁచి
పొనిఁగి పోఁకను నీపై పుట్టెడమ్మీ వలఁపు

చ. 3:

కొమ్మవొకతెతోఁ బెండ్లికొడుకవై నీవుండఁగ
కమ్మర నొకతెవచ్చి కాఁగిలించీని
యెమ్మెల శ్రీవేంకటేశ యిద్దరితో మొగమాట
యిమ్ముల కోటికిఁ బడిగెత్తెను నీరతులు