పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0211-5 ఆహిరి సంపుటం: 08-065

పల్లవి:

మగువకు దిక్కెవ్వరు మరియును నీవేకాక
తగవు ధర్మాలు నీవే తలపోయ వలదా

చ. 1:

యేపున నీయంతనీవు యింతి విచారించకున్నా
ఆపెమాట వినవద్దా అయ్యో నీవు
చాపలాన నీకంటె సవతికి దయవుట్టె
పాపపణ్యములు నీవు భావించుకోవలదా

చ. 2:

పంతాన నీకెవద్దికి ఫైకొని నీవురాకున్నా
కాంతపంపు సేయవద్దా కట్టా నీవు
పొంతనే మొగమోటము పొరుగువారెందుగలిగె
చెంత నీవిచ్చినబాస చెల్లించుకోవలదా

చ. 3:

ఇల శ్రీవేంకటేశుఁడ యెంతరాజసమైనా
చెలిమేలు చూడవద్దా చెల్లఁబో నీవు
తొలఁగక కూడితివి తోడియాపె యెచ్చరించఁగ
నెలకొన్న నీ గుణాలు నెరపఁగ వలదా