పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0210-4 దేశా(సా)క్షి సంపుటం: 08-058

పల్లవి:

వట్టిసిగ్గు లిఁకనేల వనితెల యెదుటను
వెట్టదీరనేము తెర వేతుమా యిద్దరికి

చ. 1:

పలుకుఁదేనెల విందు పచ్చిమోవి బాగాలు
కలిగె నేఁడు నీకుఁ గాంతవల్లను
పులక పువ్వుల సే బుసకొట్టు సురట్లు
నెలఁత చేకొనె నిదె నీవల్లను

చ. 2:

సిరుల నవ్వుగందాలు చెమటల పన్నీరు
దొరకె నేఁడు నీకు తొయ్యలివల్ల
సరసపుఁ బొంతనాలు సళుపుగోరి సొమ్ములు
నిరతినాపెకుఁ గూడె నీవల్లను

చ. 3:

గబ్బి బొమజంకెనలు కళలమే సుంకువలు
అబ్బెను నేఁడు నీకు నంగనవల్ల
గొబ్బున శ్రీవేంకటేశ కూడితివి జవ్వనికి
నిబ్బరపు తమి నిండె నీవల్లను