పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0210-3 వరాళి సంపుటం: 08-057

పల్లవి:

వచ్చి వచ్చి రమణుఁడు వాకిట నేల నిలిచె
తచ్చనలెల్లాఁ దెలిపె దగ్గరి రమ్మనవే

చ. 1:

వలచిన యట్టివారు వడినేమి యాడినాను
మలసి నవ్వుట గాక మంకులేఁటికి
చలములు సాదించ సవతిపోరాయేమి
తలఁపులో కొదదీర్చె దగ్గరి రమ్మనవే

చ. 2:

కొమెరపాయపువారు కొచ్చి కొచ్చి పెనఁగితే
జమళిఁ గైకొంటగాక సటలేఁటికి
వుమురఁ బెట్టగ నట్టె వుక్కిసకూడాయేమి
తమకము చెల్లఁబెట్టె దగ్గరి రమ్మనవే

చ. 3:

పొత్తుగూడినట్టివారు పొదిగి కాగిలలించితే
హత్తి మెచ్చవలెగాఁక ఆనలేఁటికి
వొత్తి శ్రీవేంకటేశుఁడు వొడివట్టి నన్నుఁగూడె
తత్తరీఁడు మాటచెప్పె దగ్గరి రమ్మనవే