పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0210-2 కొండమలహరి సంపుటం: 08-056

పల్లవి:

కొంక నీకేఁటికి లోనఁగూచున్న దదెచెలి
అంకెకు నీవు రాఁగాను అలుగునా యీకె

చ. 1:

ఎక్కడ నీవుండినాను యింతొపాందు నీకు గురి
చిక్కించి యింతికిని నీ చిత్తమే గురి
పుక్కిట చెలులెందరు పోరాటాలు వెట్టినాను
అక్కరగలదు నీతో అలుగునా యీకె

చ. 2:

యేమేమి సేసివచ్చినా యింటికి విచ్చేసితివి
కామించి కన్నులఁ జూచె కాంత నీమోము
గామిడి చెలులెంతేసి గడియించి చెప్పినాను
ఆముకొన వలచి నీకలుగునా యీకె

చ. 3:

సతులెందరు గల్లా చనవు లీసతివే
దృతినీకుఁ బట్టానకు దేవులాయెను
యితవై శ్రీవేంకటేశ యేకమైరి చెలులెల్ల
అతిరతిఁ గూడె నీతో నలుగునా యీకె