పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0210-1 నారణి సంపుటం: 08-055

పల్లవి:

పంతమిచ్చేఁ గోపయ్య పట్టవయ్య
యింత నీవుమన్నించితే యియ్య కొంటినయ్యా

చ. 1:

సెలవికి నవ్వువచ్చె చేరి నీతో మాటాడఁగ
వులివచ్చి సాము నీతో నోపమయ్యా
పులకలు మేననిండె పొంచి వద్దఁ గూచుండఁగ
యెలమి నిన్నొరయఁగ నెంత దాననయ్యా

చ. 2:

చెక్కులఁ జెమటనిండె సిగ్గులు నేఁబడఁగా
వొక్కమాటే జాణతనాలోపమయ్యా
చొక్కులు మతికి వచ్చె సుద్దులు నీచేవినఁగ
దక్కె నన్నిపనులును తమకించనయ్యా

చ. 3:

కాయము కళలురేఁగె కాఁగిట నిన్నుఁ గూడఁగా
వోయయ్య నిన్నలయించ నోపమయ్యా
యీయెడ శ్రీవేంకటేశ యిట్టెనన్ను నేలితివి
చాయలు సన్నలు లోలో సరివచ్చెనయ్యా