పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0209-6 గౌళ సంపుటం: 08-054

పల్లవి:

వద్దు వద్దు మీలోన వట్టివాదులు
సుద్దుల మాటలకే సూడువట్టేరా

చ. 1:

పంతములాడితేనేమి బలిమిచెసితేనేమి
వింతలేని మనసుల వెలఁదులకు
దొంతర వలపులెల్ల తోడుతనే వెంటరాఁగా
యింతమాత్రపు వలఁపు లివి చెల్లవా

చ. 2:

గబ్బితనమైననేమి గర్వము చూపిననేమి
వుబ్బేటి జవ్వనముల వువిదలకు
నిబ్బరపు టాసలెల్ల నిండుకొని వుండఁగాను
అబ్బురపుఁ దమకములవి మానీనా

చ. 3:

కన్నుల నొక్కిననేమి కాఁగిలించుకొన్ననేమి
నిన్నుఁ గూడి వుండినట్టి నెలఁతలకు
మన్నించు శ్రీవేంకటేశ మరి నీ యాసవుండఁగా
సన్నపు మోవితీపుల చవులెక్కవా