పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0208-6 దేశా(సా)క్షి సంపుటం: 08-048

పల్లవి:

చెప్పరాదు వాయెత్తి చేసేటి మీ చేఁతలెల్ల
కప్పిన నీగుట్టెల్లఁ గానవచ్చునిఁకను

చ. 1:

కామిని యిప్పుడు నీతోఁ గన్నులనే మాటలాడె
ఏమని యనినదో యెఱఁగఁగాని
వాములై నవవిగొన్ని వలపులు పులకలై
యీమాట కామాఁట యెనవచ్చునిఁకను

చ. 2:

చెలియ యప్పుడు నీకుఁ జేతులార సేవచేసె
చల్లపట్టి మర్మమెత్తి సాదించగాని
నిలువెల్లఁ జెమరించె నీఁకు మోహరసములై
తలఁపులు తలఁపులు తారుకాణే యిఁకను

చ. 3:

అంగన యిప్పుడు నిన్ను నాయములంటఁగఁ గూడె
పంగించి మీభావములేర్పరచఁ గాని
యింగితాన శ్రీవేంకటేశ నీవే నవ్వితివి
యెంగిలి మీమోవులివి యేరుపడెనిఁకను