ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0208-5 నాదరామక్రియ సంపుటం: 08-047
పల్లవి:
రచ్చలఁబడెవలపు రావయ్యాఁ
చెచ్చరవచ్చి ప్రియాలు చెప్పించుకోవయ్యా
చ. 1:
దగదొట్టెవలపు తరుణి నిట్టూర్పుల
యెగసక్కెములు సేసే వేమయ్యా
చిగిరించెవలపు చిత్తములో కోరికల
మొగముచూచియైన మొక్కించుకోరాదా
చ. 2:
కుచ్చిపారీ వలపులు కొమ్మచెమట యేరుల
మచ్చరమేమి గల్లాను మానవయ్యా
పచ్చనాయ వలపులు పలు పులకపైరుల
ముచ్చటాడి ఆపెచేత మొక్కించుకోరాదా
చ. 3:
నాని విరిసె వలపు నాతి సెలవినవ్వుల
లేని తరితీపుమాని లేవయ్యా
కోనల శ్రీవేంకటేశ కూడితిరి మీరిద్దరు
మోనాన నూరకే యిట్టె మొక్కించుకోరాదా