పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0208-2 సౌరాష్ట్రం సంపుటం: 08-044

పల్లవి:

మమ్మేమి బుజ్జగించేవు మాకేమి
సమ్మతించి నీకు సంతోసములై తేమేలు

చ. 1:

పయ్యద జారిననేమి భ్రమసిన నేమి నేను
నెయ్యమెంత చేసినాను నీకుమేలు
యియ్యెడ సతులతోన నెమ్మెలు మెరసేనీకు
అయ్యజియ్యవెట్టినాను అప్పటినిమేలు

చ. 2:

పవ్వళించి వుంటేనేమి బడలి వుండితేనేమి
నివ్వటించి కాఁగిలించ నీకుమేలు
రవ్వగా నీకొలువులో రాజసము చెల్లించి
పువ్వులవేసినందుకు పొగడితే మేలు

చ. 3:

తలవీడి వుంటేనేమి తప్పకచూచిననేమి
నెలవునఁగూడితివి నీకుమేలు
చెలఁగి శ్రీవేంకటేశ చేత నన్ను నేలితివి
యెలమి మనసరసాలెందుకైనమేలు