పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0208-1 రామక్రియ సంపుటం: 08-043

పల్లవి:

సాకిరులు నేము నేమే సతులుమీరడుగరే
దీకొనిమానిజములు దెలుసుకోరే

చ. 1:

పొంచి తాను నగఁగాను బొమ్మల జంకించితిని
తెంచక చెలులు పాడి దీర్చరే మీరు
కంచముపొత్తుకు రాఁగాఁ గప్పురాన వేసితివి
యెంచక యెవ్వరిది మేలేర్పరచరే

చ. 2:

పేరుకొని పిలువఁగఁ బెదవుల గొణఁగితి
తేరిచి మాడుఁబాడు దిద్దరే మీరు
చేరి జారించెఁ బయ్యద చేతఁ గొప్పువట్టితి
సారపు మాపంతములు చక్కఁ బెట్టరే

చ. 3:

మోవిదానె యియ్యఁగాను మొనపల్లు సోఁకించితి
శ్రీవేంకటేశునకు నాకుఁ జెప్పరే బుద్ది
దేవుఁడు తా నన్నుఁ గూడె తెలిసి నేనే మొక్కితి
యేవలఁ జూచిన మీరు యిఁక నేమనేరే