పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0206-1 ముఖారి సంపుటం: 08-031

పల్లవి:

ఇంత యేఁతురా సతులనెందాఁకాను
యెంతవడికెంతవడి యిప్పుడా నీవలపు

చ. 1:

మాటలకు తుదలేదు మనసుకు గురిలేదు
యేఁటికి మమ్ము బోదించేవెందాఁకాను
కాటుకకన్నుల నీరుగ్రమ్మ నెదురుచూచితి
యీటులేక బుజ్జగించేవిపుడా నీవలవు

చ. 2:

నవ్వులకు గుట్టులేదు నంటునకు వెలలేదు
యివ్వలనేఁటికి యానలెందాఁకాను
చివ్వున నిట్టూర్పురేఁగ చెక్కునఁ జేయి వెట్టితి
వె(నె?)వ్వరి సాకిరివేట్టేవిప్పుడా నీవలపు

చ. 3:

ఆసలకు తనివి లేదాయాలకు సిగ్గులేదు
యేసేవు చూపుల యమ్ములెందాఁకాను
నేసవెట్టి కూడితివి శ్రీవేంకటేశ్వర నేఁడు
యీసుదీరఁ గరుణించేవిప్పుడా నీవలపు