పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0249-2 శుద్దవసంతం సంపుటం: 08-290

పల్లవి:

పెనఁగకువే యిఁక ప్రియునితో నీవింత
మనసు లెఱుఁగుదుము మరి మాటలేలే

చ. 1:

అలుకదేరిచి పతి అట్టె పైకొనఁగాను
చలమరితనమేల సతులకును
జలజలఁ జెమరించె జాజుకొనఁ బులకించె
చెలఁగి వేగి మిగిలి చీఁకటులు గలవా

చ. 2:

నవ్వు నవ్వి యీతఁడె వనుపులు సేయఁగాను
రవ్వలఁ బెట్టఁగనేలే రామలకును
జవ్వనపు కళలుబ్బె సమ్మతులు మతికబ్బె
పువ్వులలోపలిపొల్ల పూఁచిచెప్పఁగలవా

చ. 3:

శ్రీవెంకటేశ్వరుఁడు చెక్కునొక్కి వేఁడుకోఁగా
వేవేలు మాఁటలేలే యీవెలఁదులకు
నీవాతనిఁ గూడితివి నీటులునుఁ జూపితివి
చేవల చిగురు నాఁడె సేసిపెట్టఁగలవా