పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0249-1 శ్రీరాగం సంపుటం: 08-289

పల్లవి:

గొల్లెతలై తేనె కొఱతా
పల్లదపు నీచే పడిరిగాకా

చ. 1:

కంచుఁబదనుల కాంతల నేఁడిట్టె
వంచుకొన నీకువసమా
పంచబాణముల దారికి లోనై
ముంచి చేతులెత్తి మొక్కిరిగాకా

చ. 2:

కోడెవయసు కొమెరలేమల
వాడికెకుఁ దేనువసమా
కూడఁగూడఁ బిల్లఁగోవి రాగాలకు
వాడవారు వెంటవచ్చిరిగాకా

చ. 3:

కొలఁదిలేనట్టి గుబ్బెతలనెల్ల
వలపించుకొనవసమా
యెలమి శ్రీవెంకటేశ కూడఁగాను
సొలసి చనవుచూపరిగాకా