పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0248-4 సాళంగం సంపుటం: 08-286

పల్లవి:

అనవలసేమైనా నిన్నంటిఁగాక
మునుకొని నే నీకు మొక్కకుండేనా

చ. 1:

సంతతము నందరును జయలువెట్టఁగ నీకు
కాంత లిఁక వేరె నిన్నుఁ గాదనేరా
వింతగా ఆవులు నీవెంటవెంటఁ దిరుగఁగా
మంతనాన గోపికలు మరుగకుండేరా

చ. 2:

పచ్చి పిల్లఁగోవిలోన బలు రాగాలు రాఁగాను
రచ్చకెక్కే సతులెల్ల రాకుండేరా
గచ్చులసిరి మోహాన కమలాన వేయఁగాను
తచ్చి రుక్మిణి పువ్వులదండ వేయకుండునా

చ. 3:

నిండు జలధులనీరు నిన్నుం గంటెఁ బేరఁగాను
అండ మావలపు పేరే దదియెంత
కొండల శ్రీ వెంకటేశ కూడితిమి నేము నిట్టె
వుండనుండఁదరితీపు (ల?) రూరకుండీనా