పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0248-5 సామంతం సంపుటం: 08-287

పల్లవి:

దొరలకె కానిలేదు తుంటతనము
జరసి నీతో నవ్వ సరిదాననా

చ. 1:

పతినలు వలుకఁగఁ బలుమారుఁగొసరఁగ
కతగరిచినవారుగాని నేరరు
మతిఁ బెట్టుకొని సారె మమ్మునే నమ్మించేవు
చతురతఁ బెనఁగ నీసరిదాననా

చ. 2:

బడిబడిఁ దిరుగఁగ పైపై బుజ్జగించఁగ
గడుసులయినవారుగాని నేరరు
అడియాసలు వుట్టించి ఆయము లేలంటేవు
సడిఁబెట్టి నిన్నుదూర సరిదాననా

చ. 3:

రాయడిరతిఁ బెనఁగ రారాఁపులకు నోప
కాయాటులయినవారుగాని నేరరు
యీయెడ శ్రీవెంకటేశ యిటునన్నుఁ గూడితివి
చాయలు బోధించ నీకు సరిదాననా