పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0248-3 భైరవి సంపుటం: 08-285

పల్లవి:

పూవువంటిదానను పూఁపవంటిది వయసు
సావదానమున నీసంసారఫలము

చ. 1:

నీవు బోధించినయట్టి నిజములె నానిజము
భావించి నీవు నడపె పంతము నాది
లావుల నీమన్నన కొలఁదుల వారమువేము
వోవసేసి మమ్ము నేల వొరసేవువిభుఁడా

చ. 2:

చక్కఁగా నీవు నడపె సమేళము నాసలిగె
చెక్కుల నీవు వొత్తిన చిన్న లివిగో
పక్కన నీవు గప్పినపచ్చడము నామీఁదిది
తెక్కుల నన్నెంత కెంత తెలిపేవువిభుఁడా

చ. 3:

కాఁగిట నీవుగూడిన గరిమ నేఁ బొగడేది
మాఁగిన నీమోవితేనె మావిందులు
రాఁగిన సంతోసపు రతుల నన్నేలితివి
చేఁగదేరించఁగ నేల శ్రీ వెంకటవిభుఁడా