పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0248-2 రామక్రియ సంపుటం: 08-284

పల్లవి:

బల్లిదుఁడవైతివి బతుకవయ్యా
పొల్లలేకుండా నిన్నుఁ బొగడేమయ్యా

చ. 1:

యెక్కడి కెక్కడి బుద్దులెవ్వరు చెప్పరయ్య
చిక్కి నీకుఁగాఁగ ఆపె చెప్పేఁగాక
తక్కక యెవ్వరు జాణతనాలు నేరిపరయ్య
నెక్నొన్న చుట్టరికాన నేరిపెఁగాక

చ. 2:

తతి నెవ్వరి కెవ్వరు దాయిదండయ్యేరయ్య
అతివ నీకుఁగాఁగా నాయఁగాక
రతుల కెవ్వరిపాటి రమ్మని పిలిచేరయ్య
గతియైవుండె తానె గక్కునఁ బిలిచెఁగాక

చ. 3:

కందువతో నెవ్వరు కాఁగిలించుకొనేరయ్య
అంది నిన్నుఁగాఁగా ఆపె అలమెఁగాక
యిందులో శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁగూడితివి
విందువలె తానూ నీవెంటవచ్చెఁగాక