పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0248-1 శుద్దవసంతం సంపుటం: 08-283

పల్లవి:

సంగడినున్నవారము సాకిరి చెప్పకపోదు
యింగిత మెరిఁగి నీవె యియ్యకోవయ్యా

చ. 1:

వనిత చూచినదెంత వడి నీవేల లోఁగేవు
చెనకినదెంత నీవు సేసేదెంత
వినవయ్యా ఆపెమాట వేఁడుకొనె నింతగద్దా
యెనసి ఆడినమాట కియ్యకోవయ్యా

చ. 2:

ఆపె నవ్వినది నవ్వు అప్పటి నీమతి దవ్వు
పోపో మరునియేటు పూచిన పువ్వు
వోపవయ్యా చెలి నిన్ను వొరసి చన్నులనూఁది
తీపులమోవికతలు తెలసుకోవయ్య

చ. 3:

పిలిచిన పిలుపడ బిగిసే నీగతి యేడ
వలపిల కిదా జాడ వట్టిది నీడ
యెలమి శ్రీవెంకటేశ యింతి నిన్ను నిదె కూడె
పలుకుఁ బంతాలు నీ కెప్పటివలెనయ్యా