పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0246-1 శంకరాభరణం సంపుటం: 08-271

పల్లవి:

విచారించు కొమ్మనవే వేడుక నింకాఁ దానె
పచారించి మాతో నేల పలుక వచ్చీనే

చ. 1:

విరసాలె రసాలు వేగిరపడకవుంటె
తెరమరఁగె బయలు తెలిసితేను
సరవులె వెరవులు చనవు గలిగితేను
యిరవాయఁదా నాకు నేమి బోధించీనె

చ. 2:

పంతనాలె పొంతనాలు పనులెల్లా నియ్యకొంటె
చింతలే మనోరథాలు సేసుకొంటేను
వింతలే ననుపు లవును వేసినట్టె వేసితేను
యెంతసేసి నన్నుఁదాను యేమిబోధించీనే

చ. 3:

వెగటులే పగటులు మోరపులులేకున్న
తెగువలే నగవులు దిద్దుకొంటేను
తగు శ్రీ వెంకటేశుఁడు తమకించి నన్నుఁగూడె
యెగసక్కే లిఁకలేవు యేమి బోధించీనే