పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0245-4 మాళవిగౌళ సంపుటం: 08-268

పల్లవి:

విన్నపము లింత విన్నవించవలెనా
సన్నకు మేలే నీవు జరపఁగవలదా

చ. 1:

మాటలకు గురియ మనసులో మర్మములు
తేటల తెల్లములాయ తెలిఁగన్నులు
యేఁటికి జాగులు సేసే విచ్చట నచ్చటనుండి
ఆఁటదాని అసురురంత నీకువలెనా

చ. 2:

చెక్కుమీఁది చేయాయ చిప్పిలుఁ దమకమెల్ల
మొక్కులాయ విరహము ముంచిన యాస
తక్కులఁ బెట్టఁగనేల తరితీపు నేరుచుక
చక్కని కోమలాంగిజాలి నీకు వలెనా

చ. 3:

నవ్వులకు మొదలాయ ననుపులోపలిసిగ్గు
రవ్వలకుఁ జోటాయ రతి చిహ్నలు
యివ్వల శ్రీవెంకటేశ యింతి నిట్టె కూడితివి
జవ్వని నలయించి (చనీకు?)న చలమింతవలెనా