పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0244-6 కేదారగౌళ సంపుటం: 08-264

పల్లవి:

ఎనసిన యాకెతో నీకింత యేఁటికి
వెనుకొని నావెంటనె విచ్చేయవయ్యా

చ. 1:

పలికినట్టనెపో పంతము
చలిమి బలిమిగల సతులకు
తలఁచినయట్లనె తగులము
వలపులు నెలకొన్నవారికెల్లాను

చ. 2:

చేసినవెల్లాఁ జెల్లు చేఁతలు
బాలు నమ్మినయట్టి పడఁతులకు
ఆసపడిన కోరిక లబ్బునపుడె
సేసవట్టుకుండినట్టి చెలులకును

చ. 3:

చూచినట్లనెవచ్చు సూటులు
యేచి కూడిన మీవంటిద్దరికిని
చేచేత శ్రీవెంకటేశ చెలి యలమేల్‌మంగ
లాచి నట్లనె మించె లావణ్యాలు