పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0241-4 దేసాళం సంపుటం: 08-244

పల్లవి:

అన్నిటికిఁ గలవట అందుకులేవా నీవు
నిన్ను నీవె యెంచుకొంటే నేరవా యీపనులు

చ. 1:

నవ్వులకు నొకమాట నంటున నీతో నాడితే
యివ్వల నందుకుఁగాను యెగ్గుపట్టేవు
రవ్వనవాఁడవుగావా రాజవుగావా మున్నే
అవ్వల నెంచిచూచితే నందుకునుఁ దగవా

చ. 2:

చెలిమితో నొకమాఁటు చెక్కుచేత నూఁదితేను
కలఁగి నీలోనీవే కాఁతాళించేవు
వలపు నీసొమ్ముగాదా వాడికవాఁడవుగావా
అలవాటు నీకులేదా అందుకునుఁ దగవా

చ. 3:

చనవుల నొకమాఁటు చన్నుల నేనొత్తితేను
కొనచూపులనే చూచి కూడితి విట్టే
విను శ్రీ వెంకటాద్రి గోవిందుఁడవు నీవుగావా
అనిపించుకో మాచే నందుకునుఁ దగవా