ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0241-2 పాడి సంపుటం: 08-242
పల్లవి:
దేవుఁడు దేవియు నదె తెరదియ్యరె
పూవులదండలు దీసి పువ్వులియ్యవే
చ. 1:
కన్నుల నిద్దురదేర గక్కన మేలుకొని
వున్నతి మొకాలు చూచే రొకరొకరు
పన్నీ రందియ్యరె పావడలు నందియ్యరె
గన్ననఁ గాళాంజి దగ్గరఁ బట్టరే
చ. 2:
నగవులు నగుకొంటా నంటున లేచి కూచిండి
వొగిఁ గురులు దిద్దే రొకరొకరు
తగ నద్దాలు చూపరె తతితో బూగాలియ్యరె
వొగరుదేరఁ గస్తూరి వుండ లియ్యరే
చ. 3:
బిగ్గెఁ గాఁగిలించుకొంటా ప్రియములె ఆడుకొంటా
వొగ్గిరి రతులకును వొకరొకరు
అగ్గమై శ్రీవెంకటేశుఁ డలమేలుమంగాఁ గూడి
వెగ్గళించే రలపార విసరరే యిపుడు