పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0240-4 కేదారగౌళ సంపుటం: 08-238

పల్లవి:

నీకంటె వేగిరము నిండు నావేడుకలివి
కైకొనేఁగాని పయ్యద గప్పనియ్యవయ్యా

చ. 1:

చెప్పినట్టు సేసేఁగాని చెక్కు నొక్కనియ్యవయ్య
ఆ(అ?)ప్పుడె నవ్వేఁగాని మోవాననీవయ్య
దప్పులు దేరిచేఁగాని తమ్ముల మిడనీవయ్య
గుప్పేగాఁని వలపులు గోరొత్తనీవయ్య

చ. 2:

సమ్మతించి వుండేఁగాని చన్నుల నొత్తనీవయ్య
తెమ్మగా మొక్కేఁగాని తిట్టనీవయ్య
కుమ్మరించేఁగాని మేలు కొప్పువట్టనీవయ్య
చిమ్మేఁగాని సిగ్గులెల్లాఁ జెనకనీవయ్య

చ. 3:

యెదురు మాటాడఁగాని యేకతము వినవయ్య
అదను చెప్పేఁగాని అంటనీవయ్య
పొదిగేఁగాని అలసి బుసకొట్టనీవయ్య
యిదివో శ్రీవెంకటేశ యెనసితివయ్యా