పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0240-5 కాంబోది సంపుటం: 08-239

పల్లవి:

ఇంతేసి సేసేదెల్లా నిందు కొరకా
పంతము నెరపఁబోయి భ్రమసేవు నీవును

చ. 1:

చనుఁగవ దాఁకించేవు సారెఁ బాదపువేలను
గునుకుచు నీపల్లికి గొలిచిరాఁగా
తనువెఁల్ల జెమరించి తప్పక నిన్నుఁ జూచితే
కనుఁగొనలతేటలఁ గరగేవు నీవును

చ. 2:

కుచ్చులపై నుమిసేవు కోరి నీతమ్మరసము
నెచ్చెలిచేకాళాఁజి నేఁబట్టఁగా
ముచ్చటతో సిగ్గువడి మోవ నిన్నుఁ దిట్టితే
అచ్చుమోవఁ బరవస మందేవు నీవును

చ. 3:

చెక్కు మోవినంటించేవు చేవదేరిన యాసతో
కక్కసించి నీవూడిగాలు సేయఁగా
అక్కుపై శ్రీవెంకటేశ అలమేల్మంగను నేను
గక్కననే యలసేవు కలయుచు నీవును